పండగ చేసుకున్న నితిన్

Nithin celebrated birthday with josh
Monday, March 30, 2020 - 22:00

ప్రతి ఏడాది బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాడు. ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నాడు. అయితేనేం ఇంతకుముందుతో పోలిస్తే, ఈ ఏడాది పుట్టినరోజుకే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నితిన్. ఇంకా చెప్పాలంటే ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నాడు. నితిన్ కు ఇంత ఆనందాన్నిచ్చిన ఆ హీరో మెగాస్టార్.

ఇంతకుముందు కూడా నితిన్ కు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన ట్విట్టర్ లోకి వచ్చిన తర్వాత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రెండో వ్యక్తి చిరంజీవి. అదే నితిన్ కు ఆనందం. పైగా ఊహించని విధంగా అందరికంటే ముందే చిరంజీవి బర్త్ డే విశెష్ చెప్పడంతో నితిన్ ఆనందం రెట్టింపు అయింది.

ట్విట్టర్ లోకి వచ్చిన చిరంజీవి బర్త్ డే విశెష్ చెప్పిన మొదటి వ్యక్తి రామ్ చరణ్. ఆ తర్వాత ఆ అవకాశం చిరుకు మాత్రమే దక్కింది. అందుకే ఈ హీరో అంత హ్యాపీ ఫీలవుతున్నాడు. పైగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చాలామంది గుర్తించి, నితిన్ కు ట్యాగ్ చేయడం విశేషం.