కేసీఆర్ కి చెక్ అందచేసిన నితిన్

Nithin hands over cheque of Rs 10 lakhs to CM KCR
Tuesday, March 24, 2020 - 17:15

కరోనా వ్యాప్తి నిరోధించేందుకు తనవంతుగా హీరో నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయలు అందచేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి స్వయంగా సీఎం కేసీఆర్ కి చెక్ ని ఇచ్చారు నితిన్. సీఎం నితిన్ దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా నితిన్ 10 లక్షలు ప్రకటించారు. ఆ చెక్ ని త్వరలోనే అందచేస్తారు. 

ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య అనుపమ నాదెళ్ల 2 కోట్ల రూపాయలను సీఎం నిధికి ఇచ్చారు. అనుపమ తండ్రి, మాజీ సీనియర్ IAS ఆఫీసర్ వేణు గోపాల్  అనుపమ ప్రకటించిన 2 కోట్ల మొత్తాన్ని చెక్ ద్వారా కేసీఆర్ కి అందజేశారు