ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి

Nithing to get married on April 16
Tuesday, January 14, 2020 - 13:00

సింగిల్ ఫరెవర్ గా ఉండిపోతాడేమో అని నితిన్ మదర్ చాలా కంగారు పడ్డారు ఇన్నాళ్లూ. కానీ బాచిలర్ లైఫ్ నాట్ సో బెటర్ అని అనుకొని నితిన్ ..ఇష్క్ లో పడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. లండన్ లో ఎంబీఏ చదివిన షాలిని అనే హైదరాబాదీ అమ్మాయితో చాలాకాలంగా డేటింగ్ లో ఉన్నాడు నితిన్. 

ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో ఏప్రిల్ 16న వీరి పెళ్లి జరుగుతోంది. దుబాయ్ లో పెళ్లి. డెస్టినేషన్ వెడ్డింగ్ థీమ్ ప్రకారం దుబాయ్ ని సెలెక్ట్ చేశా రట. పెళ్లికి కేవలం బంధువులు, కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ని మాత్రమే ఆహ్వానిస్తారట. హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుంది. 

తేజ తీసిన జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హీరోగా. ఈ ఏడాది నితిన్ నటిస్తున్న మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వచ్చే నెల 'భీష్మ'తో నితిన్ హంగామా మొదలవుతుంది.