షాలిని వచ్చిన వేళా విశేషం!

Nithin's girlfriend brings luck to him
Monday, February 24, 2020 - 13:15

నితిన్ దశ తిరిగింది. మళ్లీ హిట్ బాట పట్టాడు. మన దేశంలో సెంటిమెంట్లు, పట్టింపులు ఎక్కువ. ఆ లెక్కన చూస్తే... నితిన్ కాబోయే భార్యకి చాలా ఆనందం వేసి ఉంటుంది. తన గాల్ ఫ్రెండ్ షాలినిని వచ్చే నెల దుబాయిలో పెళ్లి చేసుకుంటున్నాడు నితిన్. ఆమెతో పెళ్లి అంటూ 'భీష్మ' రిలీజ్ కి కొద్దీ రోజుల ముందు ప్రకటించాడు. పెళ్లి పనులను కూడా షురూ చేశాడు. ఇప్పడు, ఆమె అడుగుపెట్టిన వేళా విశేషం అంటూ షాలినిని ప్రయిజ్ చేస్తున్నారు నితిన్ అభిమానులు. పెళ్లి ముందు ఇలా భారీ హిట్ దక్కడంతో నితిన్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. 

అల్లు అర్జున్ కంప్లిమెంట్ ఇచ్చినట్లు నితిన్ కి ఇది డబులు ట్రీట్.