నితిన్ కెరీర్ లోనే దమ్మున్న సినిమా

Nithin's Rang De has high production values..
Wednesday, October 9, 2019 - 16:15

ఇప్పటివరకు నితిన్ చాలా సినిమాలు చేశాడు. అందులో చాలా హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో అన్ని విభాగాల్లో కాస్త స్ట్రాంగ్ గా ఉన్న సినిమా చేస్తున్నాడు నితిన్. అదే రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కథ సంగతి పక్కనపెడితే.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పరంగా మూవీ చాలా రిచ్ గా ఉంది.

ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరక్టర్లలో ఇతడు  ఒకడు. అంతేకాదు, ఈ సినిమాకు లెజెండ్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తున్నాడు. ఇంతకుముందు నితిన్ చేసిన ఇష్క్ సినిమాకు ఇతడే సినిమాటోగ్రాఫర్. కాకపోతే ఆ సినిమా కంటే ఈ సినిమాలో యూనిట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఎడిటర్ గా నవీన్ నూలిని తీసుకున్నారు. మరోవైపు ఎఁతైనా ఖర్చు చేయగల సితార నిర్మాతలు ఉండనే ఉన్నారు.

టెక్నీషియన్స్ ఒకెత్తయితే.. హీరోహీరోయిన్లు మరో ఎత్తు. ఒకప్పుడు నితిన్ సినిమాలో క్రేజీ హీరోయిన్లు ఉండేవారు. కానీ అప్పుడు నితిన్ సక్సెస్ లో లేడు. కానీ ఈ సినిమాకు నితిన్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లతో పాటు ప్రకాష్ రాజ్, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ లాంటి నటులున్నారు. సో.. ఇలా కాస్ట్ అండ్ క్రూ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది రంగ్ దే సినిమా. ఎటొచ్చి మిస్టర్ మజ్ను లాంటి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. అదొక్కటి మినహాయిస్తే, మిగతాదంతా ఓకే.