లేటయినా పెళ్లి గ్రాండ్ గానే!

Nithin's wedding will happen very late
Monday, May 25, 2020 - 15:45

కరోనా వల్ల నితిన్ పెళ్లి వాయిదా పడింది. ఏప్రిల్ లో దుబాయిలో జరగాల్సిన మ్యారేజ్ ఆగింది. కొత్త ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదు. లేట్ అయినా పెళ్లి గ్రాండ్ గానే చేసుకోవాలనేది నితిన్ ప్లాన్. అందుకే తొందరపడటం లేదు. కరోనా సంక్షోభం మొత్తం తగ్గాలని చూస్తున్నాడు. మరో మూడు నెలలు పెళ్లికి  మంచి ముహుర్తాలు లేవు అనేది టాక్. ఐతే, లేట్ అయినా పర్లేదు అంటున్నాడు నితిన్. 

హైదరాబాద్ కి చెందిన షాలిని అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించారు షాలిని, నితిన్. పెళ్లి పనులు కూడా జరిగాయి. కానీ లాక్డౌన్ వల్ల అంతా తారుమారు అయింది. 

నితిన్ నటిస్తున్న సినిమాల విడుదల డేట్స్ కూడా మారాయి. 'రంగ్ దే' సినిమాని ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ కుదరకపోవచ్చు. యేలేటి దర్సకత్వంలో రూపొందుతోన్న "చెక్", మేర్లపాక గాంధీ డైరక్క్షన్ లో మొదలైన "అందాదున్" రీమేక్   సినిమా ... నెక్స్ట్ ఇయర్ కి మారిపోయాయి. ఇక కృష్ణ చైతన్య డైరక్షన్ లో హడావిడిగా అనౌన్స్ చేసిన "పవర్ పేట" ఎప్పుడు మొదలు అవుతుందో అనేది చూడాలి.