నిత్య మిష‌న్ మంగ‌ళ్‌

Nithya Menon in Mission Mangal
Monday, November 5, 2018 - 20:15

ఇప్పుడంతా స్పేస్ మూవీ సీజన్ నడుస్తున్నట్టుంది. ఆమధ్య జయం రవి హీరోగా "టిక్..టిక్..టిక్" అనే సినిమా వచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా "అంతరిక్షం" సినిమా చేస్తున్నాడు. త్వరలోనే బాలీవుడ్ లో రాకేష్ శర్మ బయోపిక్ కూడా రాబోతోంది. దీంతో పాటు ప్రియాంక చోప్రా కూడా ఓ స్పేస్ మూవీ చేయబోతోంది.

ఇప్పుడు ఇదే జానర్ లో మరో సినిమా రాబోతోంది. ఇది కూడా సంథింగ్ స్పెషల్ సినిమానే. అంగారక గ్రహ యాత్ర కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో ఓ సినిమా ప్లాన్ చేశారు. దీనికి మిషన్ మంగళ్ అనే పేరు పెట్టారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. ఇందులో హీరో ఒకటే కానీ హీరోయిన్లు మాత్రం నలుగురు. అంటే మహిళా వ్యోమగోములు ఎక్కువమంది అన్నమాట. ఈ ప్రాజెక్టులో హీరోగా అక్షయ్ కుమార్ నటించబోతున్నాడు. ఇక హీరోయిన్లుగా తాప్సి, సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, నిత్యామీనన్ నటించనున్నారు.

హీరోయిన్ నిత్యామీనన్ కు ఇదే మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేస్తారు. ప్యాడ్ మ్యాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్.బల్కితో పాటు జగన్ శక్తి ఈ సినిమాని డైరక్ట్ చేయబోతున్నారు. నిత్య మీన‌న్ ఇప్ప‌టికే సౌత్‌లో ఎంతో పేరు తెచ్చుకొంది. కానీ బాలీవుడ్‌లో స్లిమ్‌గా ఉండాలి. ఐతే ఆమె గ్లామ‌ర్ రోల్స్‌కి దూరంగా ఉంటుంద‌ట అక్క‌డ‌.