నివేదా..స్లో అండ్ స్ట‌డీ పాల‌సీ!

Nivetha Thomas is choosy
Friday, October 19, 2018 - 23:00

న‌ట‌న విష‌యంలో నివేదా థామ‌స్‌ని ఎవ‌రూ వంక పెట్ట‌లేరు. నేటి త‌రం హీరోయిన్ల‌లో మంచి యాక్టింగ్ ప్ర‌ద‌ర్శించే భామ‌ల్లో ఈ చెన్నై బ్యూటీ ఒక‌రు. కానీ ఈ అమ్మ‌డు ఎక్కువ సినిమాలు ఒప్పుకోదు. స్లో అండ్ స్ట‌డీ పాల‌సీ ఆమెది.

నానితో ఆమె న‌టించిన రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఒక‌టి ఇంద్ర‌గంటి తీసిన "జెంటిల్‌మేన్‌" కాగా, రెండోది "నిన్ను కోరి". అలాగే ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించిన "జైల‌వ‌కుశ" కూడా ఎబో యావ‌రేజ్ విజ‌యాన్నిచ్చింది. ఐనా ఆమె సినిమాలు ఒప్పుకోవ‌డంలో దూకుడు చూప‌డం లేదు.

ప్ర‌స్తుతం క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న న‌టిస్తున్న ఈ భామ తాజాగా నిఖిల్ స‌ర‌స‌న "శ్వాస" అనే చిత్రాన్ని అంగీక‌రించింది. మొద‌ట త‌న చ‌దువు కోసం సినిమాల‌ను సెల‌క్టివ్‌గా ఒప్పుకొంది. ఇపుడు క‌థ‌, నిర్మాణ సంస్థ న‌చ్చితేనే ఒప్పుకుంటానంటోంది.