చర్చల్లో నో పురోగతి!

No clarity on Ala Vaikunthapurramlo and Sarileru Neekevvaru, talks fail
Saturday, January 4, 2020 - 10:45

అటు మహేష్ బాబు క్యాంప్, ఇటు అల్లు అర్జున్ క్యాంప్ ... మెట్టు దిగడం లేదు. ఇద్దరూ రాజీకి రావడం లేదు. ఇద్దరికీ డైరెక్ట్ ఫైట్ వద్దనే ఉంది. కానీ ఇద్దరూ తమ స్టాండ్ నుంచి దిగి రావడం లేదు. నిన్న రాత్రి చర్చలు జరిపారు. కానీ ఫలితం మారలేదు. జనవరి 11నే తమ సినిమా రిలీజ్ చేస్తామని అల్లు అర్జున్ క్యాంప్ కరాఖండిగా చెప్పింది. 12న విడుదల చేస్తే.. మాకు 60 శాతం థియేటర్లు, సరిలేరు నీకెవ్వరు సినిమాకి 40 శాతం థియేటర్లు ఇవ్వగలరా అని దిల్ రాజుని బన్నీ క్యాంప్ అడుగుతోంది. కానీ రెండో రోజుకే మా సినిమాని 40 శాతం థియేటర్లకు ఎలా కుదించగలం, ఆలా చేస్తే మా సినిమా పోయింది అని జనం అనుకోరా అని వాదన లేవదీసింది మహేష్ గ్రూప్. ఈ పెద్ద సినిమాకైనా రెండో రోజే 60 శాతం థియేటర్లు తీస్తారా? అని అడుగుతోంది. 

ఇద్దరి వాదనల్లోనూ అర్థం ఉంది. 

సంక్రాంతి వంటి పెద్ద పండుగలప్పుడు ఒకేసారి మూడు సినిమాలు విడుదల ఐనా సమస్య ఉండదు... మామూలు సమయాల్లో మాత్రం రెండు పెద్ద సినిమాలు పోటీ పడొద్దు అని ఆ మధ్య దిల్ రాజు గట్టిగా చెప్పారు. పాపం ఆయన ఇలాంటి ప్రాబ్లెమ్ ఉంటుంది అని ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. మొత్తానికి ఈ పేచీ ఎప్పుడు తెగుతుందో ఎవరు చెప్పలేరు. 

యాస్ ఆఫ్ నౌ, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ... రెండూ జనవరి 11నే వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.