ఈ రికార్డ్ బాలయ్యకు మాత్రమే సొంతం

No hero can beat this record of Balakrishna
Saturday, February 29, 2020 - 09:00

ప్రతి హీరోకు రికార్డులు ఉంటాయి. అందులో చాలామటుకు కాలంతో పాటు చెల్లాచెదురైపోతుంటాయి. కానీ కొన్ని రికార్డులుంటాయి. ఎన్నాళ్లయినా, దశాబ్దాలు గడిచినా ఆ రికార్డులు క్రాస్ చేయడం మరో హీరో వల్ల కాదు. అలాంటి అరుదైన రికార్డునే బాలయ్య బాబు ఎప్పుడో క్రియేట్ చేశాడు. ఇంతకీ అతడు రికార్డు క్రియేట్ చేసింది ఎందులో తెలుసా..? మీరే చదవండి.

డ్యూయల్ రోల్స్ సెగెంట్ లో రికార్డు సృష్టించాడు బాలయ్య. అవును..  ఇప్పటివరకు 15 సినిమాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. కొన్ని సినిమాల్లో 2-3 రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కూడా బాలయ్యది డ్యూయల్ రోల్ అనే విషయం కన్ ఫర్మ్ అయింది. దీంతో ద్విపాత్రాభినయం విషయంలో అతడి కౌంట్ 16కు చేరింది.

ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా ఈ రికార్డును క్రాస్ చేయడం మరో హీరో వల్ల కాదు. ఎఁదుకంటే తమ కెరీర్ లో హీరోలు ఇన్నిసార్లు డ్యూయల్ రోల్ చేయడం చాలా కష్టం. మహా అయితే 5-6 సినిమాలు మాత్రమే చేయగలరు. బాలయ్యలా 16 సినిమాలు చేసి అతడు రికార్డును ఎవ్వరూ బద్దలుకొట్టలేరు. సో.. ఈ విషయంలో బాలయ్యది తిరుగులేని రికార్డు. భవిష్యత్ లో కూడా చెక్కుచెదరని రికార్డు ఇది. కాదంటారా?