ప్రభాస్ ఖాతాలో మరో డుమ్మా

No release from Prabhas this year
Tuesday, January 21, 2020 - 16:15

ప్రభాస్ ... సినిమా, సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రతి ఏడాది కనీసం ఒక మూవీ అయినా విడుదల అయ్యేలా మిగతా హీరోలు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒక్కో సినిమా పూర్తి చెయ్యడానికి ఏడాది పైనే టైం తీసుకుంటున్నాడు. తాజాగా మొదలయిన కొత్త మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేస్తామని కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. 

ఈ సినిమాకి ఆయన కో ప్రొడ్యూసర్. అంతే కాదు, సినిమాలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్నారు రెబెల్ స్టార్. ఒక చిన్న పాత్రలో కనిపిస్తారట. 

ఈ సినిమా కథ అంతా మార్చేశారు. కొత్తగా తీస్తున్నారు. అందుకే అంత  టైం పట్టనుంది. వేసవి సెలవులు చూసికొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట. అంటే 2020లో ప్రభాస్ నుంచి ఒక్క మూవీ కూడా రాదు. 2014, 2016, 2018... ఇలా చాలా కేలండర్ ఇయర్స్ ఈ మధ్య డుమ్మా కొట్టాడు ప్రభాస్. ఇప్పుడు 2020.