దేవ్ దెబ్బ మాములుగా లేదుగా!

No takers for Dev's satellite rights
Wednesday, February 20, 2019 - 15:45

సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడదాం. కలెక్షన్లు గురించి కూడా కాసేపు పక్కనపెడదాం. ఈ రెండు ఎలా ఉన్నప్పటికీ కార్తి సినిమా శాటిలైట్ సెగ్మెంట్ లో మాత్రం చాలా స్ట్రాంగ్. సినిమా ఠపీమని అమ్ముడుపోతుంది. "దేవ్" దెబ్బతో ఇప్పుడా ఇమేజ్ కూడా పోయింది.

ఫ్రెండ్ కదా అని సినిమా చేస్తే కార్తికి అదిరిపోయే షాకిచ్చాడు దర్శకుడు రజత్ రవిశంకర్. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్. అటు కోలీవుడ్ లో కూడా ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. తెలుగులో "దేవ్" సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం ఇప్పుడు యమ కష్టంగా మారింది. రిలీజ్ కు ముందు మేకర్స్ బెట్టుచేశారు. 3 కోట్లు, 4 కోట్లు అంటూ బేరాలు పెట్టారు. తమ సినిమాలో కార్తితో పాటు రకుల్ కూడా ఉందంటూ ఊరించారు.

కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఛానెల్స్,"దేవ్" వైపు చూడడం మానేశాయి. స్వయంగా మేకర్స్ ఆఫీసులకు వచ్చి అడుగుతున్నా.. 50 లక్షలు, కోటి రూపాయలు అంటూ రివర్స్ లో బేరాలు స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమా శాటిలైట్ వ్యవహారం గాల్లో దీపంలా మారింది.