టైగర్ కాదు లైగర్ అంట!

Not Tiger, it is Liger
Friday, February 7, 2020 - 19:30

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు ఫైటర్ అనే పేరు అనుకున్నారు మొదట. ఆ టైటిల్ కూడా పూరి రిజిస్టర్ చేయించారు చాంబర్లో. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు లైగర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశాడు పూరి.

అవును.. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై లైగర్ అనే టైటిల్ రిజిస్టర్ అయింది. అఫీషియల్ గా ఈ మేటర్ బయటకొచ్చినప్పట్నుంచి విజయ్ దేవరకొండ సినిమాకే ఈ టైటిల్ పెట్టొచ్చనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఇంతకీ లైగర్ అంటే ఏంటో తెలుసా.. మగ సింహం, ఆట పులికి పుట్టిన జంతువును లైగర్ అంటారు. అంటే.. అటు సింహం, ఇటు పులి పోలికలు రెండూ ఈ జంతువుకు ఉంటాయన్నమాట.

అంతా బాగానే ఉంది కానీ విజయ్ దేవరకొండ కథకు, ఈ లైగర్ అనే టైటిల్ కు లింక్ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికైతే మీడియా అంతా ఫైటర్ అనే టైటిల్ నుంచి లైగర్ అనే టైటిల్ కు షిఫ్ట్ అయిపోయింది. ముంబయిలో స్టార్ట్ చేసిన షెడ్యూల్ పూర్తయిన వెంటనే టైటిల్ పై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నాడు పూరి జగన్నాధ్. ఇంకా చెప్పాలంటే.. ఈ టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోనే సినిమా ప్రచారాన్ని అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతున్నాడు.

ఈ నెల 14 నుంచి మళ్ళీ ముంబైలో రెండో  షెడ్యూలు మొదలవుతుంది. అప్పుడే హీరోయిన్ పేరు కూడా ప్రకటిస్తారు.