ప్రభాస్ పెళ్లి సంగతేంటి?

NRI alliance for Prabhas
Sunday, August 4, 2019 - 12:15

బాహుబలి-2 థియేటర్లలోకి వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానన్నాడు. ఆ సినిమా రిలీజైపోయింది. సాహో  చాన్నాళ్లుగా లేట్ అవుతోందని, అది పూర్తయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానన్నాడు. ఇప్పుడు సాహో సినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది.  మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? అక్కడికే వస్తున్నాం. 

ప్రభాస్ కోసం ఓ ఎన్నారై సంబంధం రెడీగా ఉందట.

అమెరికాకు చెందిన ఓ బిజినెస్ మేన్ కూతుర్ని ప్రభాస్ పెళ్లాడతాడంటూ సరికొత్త ప్రచారం షురూ అయింది. అమ్మాయి  పేరుతో పాటు ఇతర విషయాలు మాత్రం బయటకు రాలేదు. కాకపోతే ఆ బిజినెస్ మేన్ కు మాత్రం భీమవరం మూలాలు ఉన్నాయని టాక్. గతంలో కూడా ప్రభాస్ పెళ్లిపై ఇలాంటి పుకార్లు చాలా వచ్చాయి. స్వయంగా కృష్ణంరాజు అప్పట్లో కొన్ని హింట్స్ ఇచ్చారు. కానీ ఆ సంబంధాలేవీ వర్కవుట్ కాలేదు. 

తాజాగా వినిపిస్తున్న ఎన్నారై సంబంధం విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రభాస్ కు పెళ్లీడు దాటిపోతోందనే విషయం మాత్రం పచ్చి నిజం. మరో 2 నెలలు గడిస్తే ప్రభాస్ ఏకంగా 40వ వడిలోకి ఎంటరవుతాడు. 

ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇకనైనా ప్రభాస్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలనేది అతడి అభిమానుల ఆశ మాత్రమే కాదు, అశేష తెలుగు ప్రేక్షకుల ఆశ కూడా. ప్రస్తుతం వినిపిస్తున్న ఎన్నారై సంబంధంపై ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు రియాక్ట్ అవుతారేమో చూడాలి.