కమల్ తో ఎన్టీఆర్ పోటీ

NTR and Kamal Haasan are hosting Big Boss in South India
Tuesday, June 13, 2017 - 15:30

ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోటీకి సిద్ధమయ్యాడు. అది కూడా వెండితెరపై కాదు. బుల్లితెరపై. అవును.. ఎన్టీఆర్, కమల్ ఇప్పుడు ఒకే షో చేస్తున్నారు. కాకపోతే భాష వేరు. తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎన్టీఆర్ ను తీసుకుంటే.. తమిళ్ లో అదే బిగ్ బాస్ షో కోసం కమల్ హాసన్ ను తీసుకున్నారు.

తమిళ్ లో కమల్ హాసన్ పై ఇప్పటికే బిగ్ బాస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసి ఓ స్టిల్ రిలీజ్ చేశారు. తమిళ్ లో బిగ్ బాస్ కార్యక్రమాన్ని విజయ్ టీవీ ప్రసారం చేయబోతోంది. ఇక తెలుగులో స్టార్ మా, బిగ్ బాస్ ను ప్రొడ్యూస్ చేస్తోంది.
 
అన్నింటికీ మించి ఈ రియాలిటీ షోకు సంబంధించి కమల్, ఎన్టీఆర్ మధ్య మరో సిమిలారిటీ కూడా ఉంది. వీళ్లిద్దరికీ ఇదే ఫస్ట్ రియాలిటీ షో కావడం విశేషం. “వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించారు. కానీ బుల్లితెరపై ఓ రియాలిటీ షోకు యాంకర్ గా మాత్రం ఇప్పటివరకు చేయలేదు. రియాలిటీ షో అనేది నా రియల్ లైఫ్ కు కెరీర్ కు చాలా దూరం. ఈ సరికొత్త ప్రయత్నం నాలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి”. బిగ్ బాస్ షోకు సంబంధించి కమల్ రియాక్షన్ ఇది.
 
ఇటు ఎన్టీఆర్ కూడా అంతే ఎక్సయిటింగ్ గా ఉన్నాడు. సిల్వర్ స్క్రీన్ పై వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో..  అదే ఊపులో ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా హీరోలు టెలివిజన్ తెరపైకి రావడం కొత్తకాదు. నాగ్ ఎప్పుడో వచ్చేశాడు. తాజాగా చిరంజీవి కూడా వచ్చాడు. కాకపోతే ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం సంథింగ్ స్పెషల్. ఎందుకంటే.. ఎన్టీఆర్ నేటి త‌రం టాప్ హీరోల్లో ఒక‌రు. అంతేకాదు, షోకు సంబంధించి ఎన్టీఆర్ ను కమల్ హాసన్ తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు మరి.