ఎన్టీఆర్ నోటా బాబాయి మాట!

NTR brings Balakrishna's topic
Wednesday, January 8, 2020 - 23:30

జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ మధ్య అల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఓపెన్ సీక్రెట్. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటారు. ఈవెంట్స్ లో కలిసి దర్శనమిస్తారు కానీ ఇద్దరివి తూర్పు, పడమర దిక్కులే. చాలా కాలంగా ఎన్టీఆర్ ... బాలకృష్ణ ప్రస్తావనని తన స్పీచ్ ల్లో తీసుకురావడం లేదు. ఐతే, తాజాగా 'ఎంత మంచివాడవురా' సినిమా ఈవెంట్ లో జూనియర్ తన బాబాయి ప్రస్తావన తెచ్చ్చాడు. 

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమా నిర్మాతల్లో ఒకరు కృష్ణ ప్రసాద్. ఆయన బాలకృష్ణతో ఆదిత్య 369, వంశానికొక్కడు వంటి సినిమాలు తీశారు. ఆ విషయాన్నీ ఎన్టీఆర్ ... ఈ సినిమా స్టేజిపై ప్రస్తావించడం ఆశ్చర్యపరిచింది. 

ఇక, ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్... పెద్దగా మాట్లాడలేదు. సింపుల్ గా ముగించారు. "కల్యాణ్ అన్న మంచి కుటుంబ సినిమా చేస్తే చూడాల‌ని ఉండేది. ఈ సినిమాతో మా ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న దాన్ని పూర్తి చేశారు. నిర్మాత కృష్ణ‌ప్ర‌సాద్‌గారు మా కుటుంబానికి శ్రేయోభిలాషి. మా కుటుంబ‌స‌భ్యుడు. బాబాయ్‌తో ఎన్నో సినిమాలు చేశారాయ‌న‌. ఈ పండ‌గ వాతావ‌ర‌ణంలో విడుద‌ల‌వుతున్న ద‌ర్బార్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురం, ఎంత మంచి వాడ‌వురా... పెద్ద హిట్ కావాలి. ఈ చిత్రాల విజ‌యం తెలుగు చిత్ర సీమ ముందుకు వెళ్లేలా దోహ‌ద‌ప‌డాల‌ని కోరుకుంటున్నా`` అని అన్నారు జూనియర్.