బావ కంగ్రాట్స్.. బన్నీ & తారక్

NTR congratulates Allu Arjun
Sunday, January 12, 2020 - 22:45

"అల వైకుంఠపురములో" సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రేటింగ్లు కూడా బాగా వచ్చాయి. ఓవరాల్ గా సంక్రాతి హిట్ అనిపించుకుంది. దీంతో హీరోలంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. యూనిట్ కు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ క్రమంలో బావ అంటూ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

"అల్లు అర్జున్ నుంచి టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రిలియంట్ రైటింగ్ కలిపి అల వైకుంఠపురములో సినిమాను హిట్ చేశాయి. కంగ్రాట్స్ బావ (బన్నీ) అండ్ స్వామి (త్రివిక్రమ్)" అంటూ ట్వీట్ పెట్టాడు ఎన్టీఆర్. అంతేకాదు, ప్రత్యేకంగా బన్నీకి ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పాడు. దీనిపై బన్నీ కూడా రియాక్ట్ అయ్యాడు. థ్యాంక్స్ బావ అంటూ రీట్వీట్ చేశాడు.

సినిమాలో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో పాటను వాడుకున్నాడు బన్నీ. ఐ వానా ఫాలో ఫాలో యు అనే పాటను ఓ సందర్భంలో వాడుకున్నాడు. దీంతో పాటు పవన్, మహేష్ పాటల్ని కూడా సినిమాలో వాడుకున్నారు. సినిమాకు ఈ ఎపిసోడ్ వన్ ఆఫ్ ది హైలెట్స్ గా నిలిచింది.