ఎన్టీఆర్ లైపో చేయించుకున్నాడా?

NTR Jr has gone for liposuction surgery for weight loss?
Wednesday, December 20, 2017 - 23:45

టాలీవుడ్ లో ఇదొక మేజర్ టాపిక్ అయిపోయింది. ఈ టాపిక్ పై రెండు వర్గాలుగా చీలిపోయారు జనాలు. చేయించుకున్నాడని కొందరు అంటుంటే... లేదు ఇదంతా పుకారు అని మరికొందరంటున్నారు. మెజారిటీ జనాలైతే లైపో చేయించుకున్నాడనే వార్తకే ఫిక్స్ అయ్యారు.

జై లవకుశ టైమ్ లో ఎన్టీఆర్ కాస్త లావుగా కనిపించాడు. జై క్యారెక్టర్ కోసం కాస్త బరువు పెరిగాడని అప్పట్లో ఫ్యాన్స్ సమర్థించుకున్నారు. కానీ నెక్ట్స్ చేయబోయే త్రివిక్రమ్ సినిమాకు ఈ సమర్థింపులు చెల్లవు. ఎందుకంటే ఇదొక కూల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఎంత స్లిమ్ గా కనిపిస్తే అంత బాగుంటుంది. అందుకే ఉన్నఫలంగా బరువు తగ్గేందుకు "లైపో"ను ఆశ్రయించాడంటూ వార్తలు వస్తున్నాయి. మరికొందరు మాత్రం దీనిపై ఏకీభవించడం లేదు.

డీ-టాక్సిఫికేషన్, సర్జరీ లాంటి పద్ధతులు ఎన్టీఆర్ కు అవసరం లేదని, సహజంగానే కసరత్తులు లాంటివి చేసి, ఆహారపు అలవాట్లు మార్చుకొని బరువు తగ్గాడని వాదిస్తున్నారు. అయితే దీనికి టైం ఎక్కువ పడుతుంది. ఇంత షార్ట్ టైమ్ లో ఎన్టీఆర్ 5 కిలోలు బరువు ఎలా తగ్గాడనేది డౌట్. అందుకే అలా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఐతే ఎన్టీఆర్ శ‌రీర‌త‌త్వం ఏంటంటే... ఎక్స్‌ర్‌సైజ్ చేయ‌క పోతే ఈజీగా లావు అవుతాడు. కాస్త క‌ష్ట‌ప‌డితే అంతే సులువుగా స‌న్న‌బ‌డ‌గ‌లడు. సో.. ఎన్టీఆర్‌కిపుడు ఆర్టీఫిషియ‌ల్ టెక్నిక్స్ అవ‌స‌రం లేద‌ని చెప్పొచ్చు.