ఎన్టీఆర్‌కి బెస్ట్ కాంప్లిమెంట్ అదే

NTR receives best compliment from this director
Saturday, May 20, 2017 - 21:30

ఎన్టీఆర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న స్టార్ హీరోల్లో బాగా న‌టించే స‌త్తా ఉన్న స్టార్‌ల‌లో ఎన్టీఆర్ టాప్ లీగ్‌లోనే ఉంటాడు. ఇక డైలా డెలీవ‌రీలో ది బెస్ట్‌. సెట్ పైకి వ‌స్తే ఎన్టీఆర్ పులి అని అంటారు ఆయ‌న‌తో ప‌ని చేసిన ద‌ర్శ‌కులు. ఎంత ట‌ఫ్ సీన్ ఇచ్చినా సింగిల్ టేక్‌లో లాంగిచేస్తాడట‌. అందుకే ఎన్టీఆర్‌కి ద‌ర్శ‌కుల్లో బాగా క్రేజ్‌. ఎందుకంటే ఆయ‌న‌తో ప‌నిచేస్తే న‌ట‌న రాబ‌ట్టేందుకు క‌ష్టప‌డాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఇంకో టేక్ తీసుకోవాలంటే వేరే రీజ‌న్స్ అయి ఉండాలి కానీ ఎన్టీఆర్ ఆ సీన్ చేయ‌లేక‌పోవ‌డ‌మ‌నేది ఉండ‌ద‌ట‌.

అందుకే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ...ఎన్టీఆర్‌ని వ‌న్ అండ్ వ‌న్ టేక్ ఓన్లీ హీరో అని ప్ర‌శంసించాడు. ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా చేసిన దర్శకుడు హరీష్‌ శంకర్ ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ట్వీట్ చేశాడు. యంగ్ టైగ‌ర్ ... వన్‌ అండ్‌ 'ఓన్లీ వన్‌' టేక్‌ హీరో.. అంటూ వెరైటీగా విష్ చేశాడు. ఈ ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అయ్యారు. ఒక‌టే షేరింగ్‌లు, రీట్వీట్‌లు. 

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి. హీరోల‌ను వ‌ర్ణించ‌డంలో హ‌రీష్ శంక‌ర్ స్ట‌యిలే వేరు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెపుతూ  'ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు అన్నాడు. అది ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కి బెస్ట్ మంత్ర అయింది.