ఎన్టీఆర్ న్యూస్ అబ‌ద్ద‌మే!

NTR - Sharddha Kapoor news is wrong!
Tuesday, January 30, 2018 - 15:45

ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ శ్ర‌ద్దాక‌పూర్ క‌న్‌ఫ‌మ్ అయిందా? అవును...అయిందంటూ ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే సినిమా ప్రొడ‌క్ష‌న్ టీమ్ మాత్రం ఇదంతా ఊహాగానమే అంటోంది.

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కు క్యాస్టింగ్ గురించి ఎలాంటి ఆలోచ‌న చేయ‌లేదు. ఆయ‌న త‌న క‌థ‌కి తుది మెరుగులు దిద్దే ప‌నిలో ఉన్నారు. అది పూర్త‌యిన త‌ర్వాత క్యాస్టింగ్‌, క్రూ గురించి ఆలోచిస్తాడు. ఈ లోపు శ్ర‌ద్దాక‌పూర్‌, పూజా హెగ్డే, అను ఇమ్మాన్యుయేల్ పేర్ల‌న్నీ వ‌చ్చేశాయి.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త‌న బాడీని తీర్చిదిద్దుకునే ప‌నిలో ఉన్నాడు. ఇటు త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్‌కి ఫైన‌ల్ ట‌చెస్ ఇస్తున్నాడు. సో హీరోయిన్ల గురించి క్లారిటీ రావాలంటే మ‌రో నెల ఆగాల్సిందే.