తమన్న కోసం తప్పు తన మీద వేసుకున్నాడు

Ohmkar defends Tamannah
Saturday, October 12, 2019 - 17:30

రాజుగారి గది-3లో నటించడానికి ఒప్పుకుంది.
ఓపెనింగ్ కు కూడా వచ్చింది.

అంతలోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది మిల్కీబ్యూటీ. సైరా సినిమాకు మరిన్ని కాల్షీట్లు కావాల్సి రావడంతో పాటు.. హిందీలో ఒప్పుకున్న ఓ సినిమాను పూర్తిచేసే క్రమంలో "రాజుగారి గది-3" నుంచి ఆమె బయటకొచ్చేసింది. ఇదే విషయాన్ని చెబితే సరిపోయేది. కానీ దర్శకుడు ఓంకార్ మాత్రం ఇలా చెప్పలేదు. తమన్నాను వెనకేసుకొచ్చాడు. తప్పంతా తమదే అంటున్నాడు.

"ముందు ఈ సినిమాను తమన్నతోనే మొదలుపెట్టాం. ఓపెనింగ్ కూడా అయింది. ఆమె వచ్చింది కూడా. అయితే ఆమె డేట్స్ కారణంగా తప్పుకున్నారు. ఇప్పటికే మావి 2 షెడ్యూల్స్ లేట్ అయ్యాయి. అక్టోబర్ లో విడుదల పెట్టుకోవడంతో ఇక తమన్నా కోసం ఎదురుచూడడం వేస్ట్ అనిపించింది. ఆమె లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి కోసం చూశాం కానీ ఎవ్వరూ దొరకలేదు."

ఇలా తప్పును తనమీద వేసుకున్నాడు ఓంకార్. ఎవ్వరూ దొరకట్లేదని బాధపడుతున్న టైమ్ లో అవికా గౌర్ ఎదురుపడిందని, తమ సినిమాకు ఆమె అతికినట్టు సరిపోయిందని, ఆమె చాలా ప్లస్ అయిందని కూడా చెబుతున్నాడు ఓంకార్.

చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది అవికా గౌర్. అయితే అప్పటి క్యూట్ నెస్ ఇప్పుడు ఆమె ముఖంలో కనిపించడం లేదు. బరువును కాస్త కంట్రోల్ లోనే పెట్టుకున్నప్పటికీ, ఎందుకో ముఖంలో గ్లో తగ్గిపోయింది. ఇదెలాగూ హారర్ కామెడీనే కాబట్టి అవికా అందాలతో ఓంకార్ కు పెద్దగా పని పడినట్టు లేదు. 18న థియేటర్లలోకి వస్తోంది రాజుగారి గది 3.