ఒక్క క్ష‌ణం కాపీ కొట్టిన‌ట్లే!

Okka Kshanam director copies Korean movie story!
Wednesday, December 20, 2017 - 18:30

మొన్నటివరకు "ఒక్క క్షణం", "2-మేమిద్దరం" సినిమాల మధ్య భారీస్థాయిలో రగడ జరిగింది. కొరియన్ సినిమా ప్యారలల్ లైఫ్ ను కాపీ కొట్టి ఒక్క క్షణం సినిమాను తీస్తున్నారని ఆరోపించాడు నిర్మాత అనీల్ సుంకర. అదే సినిమా రీమేక్ రైట్స్ ను అధికారికంగా దక్కించుకొని  2-మేమిద్దరం అనే సినిమా నిర్మిస్తున్నాడు సుంకర. దీంతో పంచాయితీ ఓ రేంజ్ లో నడిచింది. కానీ సెడన్ గా ఏమైందో ఏమో అనీల్ సుంకర చల్లబడ్డాడు.

"ఒక్క క్షణం" నిర్మాత, దర్శకుడితో చర్చలు సాఫీగా సాగాయని, ఎలాంటి సమస్యల్లేవని ట్వీట్ చేశాడు. అల్లు శిరీశ్, దర్శకుడు వీఐ ఆనంద్ కు అడ్వాన్స్ గా కంగ్రాట్స్ కూడా చెప్పాడు. దీంతో ఎన్నో గొడవలకు దారితీస్తుందనుకున్న ఈ వివాదం ఒక్కసారిగా చల్లబడింది.

ఈ మొత్తం ఎపిసోడ్ వెనక ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నడిచిందట. అందులో మొదటిది దర్శకుడు వీఐ ఆనంద్ ఒప్పుకోవడం. "ప్యారెలల్ లైఫ్" సినిమా పాయింట్ నే "ఒక్క క్షణం" కోసం లేపేశానని ఆనంద్ నాలుగు గోడల మధ్య కమిట్ అయ్యాడట. ఇక రెండో ఎలిమెంట్ ఏంటంటే.. ఈ సారికి తనను వదిలేస్తే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పై ఓ సినిమా చేసి పెడతానని అనీల్ సుంకరకు మాటిచ్చాడట. దీంతో కథ కంచికి వెళ్లిందని తెలుస్తోంది.