ఆన్ లైన్లో మ్యూజిక్ సిట్టింగ్స్

Online music sittings for 18 Pages
Thursday, March 26, 2020 - 18:30

కరోనా కారణంగా సినీజనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే కొంతమంది మాత్రం ఖాళీగా ఉండడం లేదు. టెక్నాలజీని వాడి మరీ తమ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం "18 పేజెస్" అనే సినిమా యూనిట్ ఇలానే పనిచేస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కావాలి. కానీ కరోనా కారణంగా ఆ షూటింగ్ నిరవథికంగా వాయిదా పడింది.

ఈ గ్యాప్ లో దర్శకుడు సూర్యప్రతాప్, సంగీత దర్శకుడు గోపీసుందర్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. అయితే వీళ్లిద్దరూ కలుసుకోలేదు. టెక్నాలజీ సాయంతో ఆన్ లైన్ లోనే వీళ్లు మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారు. అలా "18 పేజెస్" సినిమా కోసం గోపీసుందర్ 2 పాటలు ఫైనలైజ్ చేశాడు.

"శైలజారెడ్డి అల్లుడు" టైమ్ లో కేరళలో వచ్చిన వరదల్లో చిక్కుకున్నాడు గోపీసుందర్. దీంతో సకాలంలో రీరికార్డింగ్ పూర్తికాక ఆ సినిమా ఓసారి వాయిదాపడింది. అయితే ఈసారి మాత్రం అలాంటి సమస్యల్లేవు. హైదరాబాద్ లోనే గోపీసుందర్ సొంతంగా స్టుడియో పెట్టుకున్నాడు. దీంతో అతడికిప్పుడు మరిన్ని అవకాశాలొస్తున్నాయి. ఇక "18 పేజెస్" విషయానికొస్తే.. గీతాఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ప్రారంభమైన ఈ సినిమాలో నిఖిల్ హీరో. ఉప్పెన సినిమాలో నటిస్తున్న కృతిషెట్టిని  హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు