బాలయ్యకి పాయల్ ఫిదా

Paayal Ghosh praises Balakrishna
Sunday, July 5, 2020 - 21:30

కొన్ని రోజులుగా టాలీవుడ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న హీరోయిన్ పాయల్ ఘోష్.. మరోసారి టాలీవుడ్ పై, తెలుగు హీరోలపై పొగడ్తల వర్షం కురిపింది. సుశాంత్ ఆత్మహత్య టైమ్ లో నెపొటిజం, హీరోల ఆధిపత్యం, కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ.. టాలీవుడ్ ను మెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈసారి బాలయ్యను టార్గెట్ చేసింది.

తను టాలీవుడ్ లో వర్క్ చేసిన టైమ్ లో బాలయ్యతో కలిసి ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ వెళ్లింది పాయల్. అప్పటి ఫొటోల్ని ఇప్పుడు ఫ్రెష్ గా మరోసారి పోస్ట్ చేసింది. బాలయ్య చాలా గొప్పోడు అంటూ పొగడ్తలు మొదలుపెట్టింది.

బాలయ్య ఎప్పుడూ తనకు మంచిగానే కనిపిస్తారని, బాలయ్యతో ఉన్నంతసేపు చాలా బాగుంటుందని చెప్పుకొచ్చిన పాయల్... బాలకృష్ణ అంటే తనకు ప్రేమ, గౌరవం ఉన్నాయని ప్రకటించింది.

పాయల్ వరస చూస్తుంటే.. ఆమె మరోసారి టాలీవుడ్ లో ఛాన్సుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.