క్రేజ్ తగ్గించుకోవడం అంటే ఇదే!

Paayal Rajput does a short film
Monday, May 18, 2020 - 10:15

సమంత ఖాళీగా ఉంది. కాజల్ కూడా ఖాళీగా ఉంది. రష్మిక కూడా ఖాళీగానే ఉంది. ఇలా హీరోయిన్లంతా ఖాళీగానే ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్లు చేసుకుంటున్నారు. కానీ ఎవ్వరూ షార్ట్ ఫిలిమ్స్ చేయలేదు. అది చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువనే విషయం వాళ్లకు తెలుసు. ఈ చిన్న లాజిక్ ను పాయల్ మిస్ అయింది.

లాక్ డౌన్ టైమ్ లో షార్ట్ ఫిలిం చేసింది పాయల్. 24 గంటల్లోనే షూటింగ్ పూర్తిచేశామంటూ దాన్ని నెట్ లో పెట్టింది. అయితే హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న టైమ్ లో ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేస్తే క్రేజ్ తగ్గిపోతుందనే విషయాన్ని మాత్రం ఆమె గ్రహించలేకపోయింది. హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. ఉన్నంతలో ఎన్ని సినిమాలు చేశామన్నది ఇంపార్టెంట్. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అంటూ ఒక్కసారి సైడ్ ట్రాక్ లోకి వెళ్తే కెరీర్ గాడి తప్పినట్టే. పాయల్ కు ఈ విషయం ఇప్పట్లో అర్థంకాకపోవచ్చు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి పాయల్ ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూనే ఉంది. ఆర్ఎక్స్100 లాంటి బిగ్గెస్ట్ హిట్ ను క్యాష్ చేసుకోవాల్సిన టైమ్ లో ఐటెంసాంగ్ చేసింది. పోనీ అక్కడితోనైనా ఆగిందా అంటే అదీ లేదు. కుర్రహీరోల సినిమాలు వదిలేసి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరో సరసన నటించింది. మధ్యలో RDXలవ్ అనే దిక్కుమాలిన సినిమా చేసింది.

ఇలా కెరీర్ పరంగా చేసిన తప్పులకు ఇప్పుడీ షార్ట్ ఫిలిం కూడా తోడైంది. రష్మిక, రాశిఖన్నా లాంటి హీరోయిన్లు షార్ట్ ఫిలిమ్స్ చేయలేక కాదు. అది చేస్తే వచ్చే లాభం కంటే జరగబోయే నష్టమే ఎక్కువనే విషయం వాళ్లకు తెలుసు. పాయల్ మాత్రం ఇవేవీ ఆలోచించలేదు. ఇంతా చేసి ఆ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఏమంత గొప్పగా కూడా లేదు.