ఈ యాంగిల్ కూడా ఉందా?

Paayal Rajput showcases another angle
Wednesday, June 10, 2020 - 14:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో రకరకాల పనులు చేసింది పాయల్ పాప. తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేసింది. పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అంటూ ఒంటికి దిండు, పేపర్ టైపులో డ్రెస్ కట్టుకొని ఫొటోలు దిగింది. కొత్తకొత్త వంటకాలు కూడా చేసింది. తాజాగా తనలోని మరో కోణాన్ని కూడా బయటపెట్టింది పాయల్. ఆవులకు గ్రాసం పెడుతూ.. మూగ జీవాలపై తనకున్న ప్రేమను బయటపెట్టింది.

జంతువులన్నీ ప్రేమను కోరుకుంటాయి, వాటిని ప్రేమించేవరకు మనలో ఓ అత్మ అలా అచేతనంగానే ఉంటుందంటూ ఓ భారీ సందేశం పెట్టి మరీ.. పశువులకు గ్రాసం పెడుతున్న వీడియోను పోస్టు చేసింది పాయల్. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాయల్ పాపలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం పాయల్ కు తెలుగులో అంతంతమాత్రంగానే అవకాశాలు వస్తున్నాయి. "ఆర్ఎక్స్100" సక్సెస్ ను క్యాష్ చేసుకోవడంలో ఫెయిలైన ఈ ముద్దుగుమ్మ "డిస్కోరాజా"తో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో "నరేంద్ర" అనే సినిమా మాత్రమే ఉంది. ఈ లాక్ డౌన్ తో ఆమె అవకాశాలకు మరింత గండి పడినట్టయింది.