పాయల్‌ రాజ్‌పుత్‌ కోరుకుంటున్నదిదేనా

Paayal Rajput wants sexy image
Thursday, August 29, 2019 - 23:00

పాయల్‌ రాజ్‌పుత్‌కి గ్లామర్‌ హీరోయిన్‌ అనే ఇమేజ్‌ ఉంది. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఆమెకి ఈ ఇమేజ్‌ దక్కింది. ఐతే ఈ ఛట్రం నుంచి ఆమె బయటపడే ఆలోచనలో ఉన్నట్లు లేదు. తాజాగా నటించిన ఆర్‌డిఎక్స్‌ లవ్‌లోనూ సెక్స్‌ సీన్లను తలపించే సన్నివేశాల్లో కనిపించింది. అలాగే డైలాగ్‌లు కూడా అలాగే ఉన్నాయి. ఒంట్లో ఫీలింగ్స్‌ కంట్రోల్‌ చేసుకోలేకపోతే ఇంట్లో సేఫ్టీలు (కండోమ్స్‌) రెడీగా ఉంచుకోవాలి వంటి డైలాగ్‌లతో పాటు మీరు ఎపుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా వంటి ప్రశ్నలతో ఈ టీజర్‌ సాగింది.

ఇలాంటి సినిమాలు చేస్తే ఈ భామకి పెద్ద హీరోలతో ఇకపై సినిమాలు వస్తాయా?

ఆ మధ్య ఒక సినిమాలో ఐటెంసాంగ్‌ చేస్తే పేలలేదు. తాజాగా వెంకటేష్‌ వంటి ఫ్యామిలీ స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరో సరసన వెంకీ మామలో నటిస్తోంది. మరి ఈ మూవీతో అయినా ఆమె ఇమేజ్‌ మారుతుందా లేదా ఆమె కోరుకుంటున్న క్రేజ్‌ కూడా ఇలాంటిదేనా.