అడుగు దూరంలో బంపరాఫర్

Paayal Raput to get Pushpa item song?
Friday, July 3, 2020 - 19:15

పాయల్ మరో క్రేజీ ఆఫర్ అందుకోబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే "పుష్ప" ప్రాజెక్టులోకి ఆమె ఎంటరయ్యే అవకాశాలున్నాయి. అవును.. పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ కోసం పాయల్ ను అనుకుంటున్నారు. ఆమె దాదాపు ఫిక్స్ అయినట్టే.

నిజానికి ఈ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్స్ ను ట్రై చేశారు. కుదరకపోతే టాలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్ తో చేయాలనేది ప్లాన్. కానీ ఎందుకో ఇప్పుడు పాయల్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యమే.

"ఆర్ఎక్స్100"తో గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అయితే ఆ తర్వాత పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. మధ్యలో ఓ ఐటెంసాంగ్ చేసినా అది ఓ మోస్తరుగానే క్లిక్ అయింది. "పుష్ప"లో ఐటెంసాంగ్ చేస్తే మాత్రం క్రేజ్ వచ్చే అవకాశాలున్నాయి

ఎందుకంటే, సుక్కూ-దేవిశ్రీ కాంబోలో వచ్చిన ఐటెంసాంగ్స్ అన్నీ హిట్. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరికీ బన్నీ తోడైతే ఆ స్పెషల్ సాంగ్ సూపర్ హిట్. అలా వీళ్ల ముగ్గురి కాంబోలో వస్తున్న సినిమాలో ఐటెంసాంగ్ అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాయల్ కు ఇది మంచి అవకాశమనే చెప్పాలి.