నా బాయ్ ఫ్రెండ్ ఇతనే: పాయల్

Paayal reveals about her boyfriend
Wednesday, February 12, 2020 - 19:00

లైమ్ లైట్లో ఉన్నప్పుడు ప్రేమ విషయాలు బయటపెట్టకూడదు. అందుకే హీరోయిన్లు క్రేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి కూడా చేసుకోరు. కానీ పాయల్ మాత్రం ఈ విషయంలో మొహమాటపడలేదు. తన బాయ్ ఫ్రెండ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇతడి పేరు సౌరభ్ ధింగ్రా.

పాయల్ తో కలిసి సినిమా సెట్స్ లో కనిపించేది ఇతడే. మొన్నటివరకు పాయల్ కు అతడు గార్డియన్ అనుకున్నారు. తోడుగా ఉన్నాడని భావించారు. కానీ తాజాగా పాయల్ పెట్టిన పోస్ట్ తో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. కుర్రాళ్ల గుండెలు బద్దలయ్యాయి.

రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకున్నాడు సౌరభ్. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెప్పిన పాయల్.. పనిలోపనిగా తన మనసులో మాటను కూడా బయటపెట్టేసింది. తను ఎన్ని మిస్టేక్స్ చేసిన ప్రేమించేవాడు, తన జీవితానికి ఓ కొత్త ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చిన వాడు అంటూ తెగ పొగిడేసింది. చివర్లో హ్యాపీ బర్త్ డే మేరీ జాన్ అంటూ పాయల్ చెప్పడంతో జనాలకు మేటర్ అర్థమైపోయింది.

పాయల్ తరుచుగా కనిపించేది ఇతడితోనే. ఖాళీ సమయాల్లో ఇతడితోనే గడిపేస్తుంది. స్వతహాగా ఈయన ఓ మోడల్, నిర్మాత కూడా. తను సింగిల్ కాదని ఆ మధ్య ప్రకటించిన పాయల్, ఇప్పుడు ఇలా ఫొటోలు పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది.