ఆర్థికంగా చితికిపోయిన హీరోయిన్

Paayal says her financial position has worsened
Saturday, April 18, 2020 - 11:15

కరోనా వల్ల కొంతమంది జీవితాలు తలకిందులయ్యాయి. దీనికి సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. తాజాగా ఈ లిస్ట్ లోకి మాజీ హీరోయిన్ పాయల్ ఘోష్ చేరిపోయింది. ప్రయాణం, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్, ప్రస్తుతం కరోనా వల్ల తను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు ప్రకటించింది.

సినిమా అవకాశాల్లేని పాయల్.. ప్రస్తుతం పూర్తిగా ఫొటోషూట్ల మీద మాత్రమే ఆధారపడింది. వారానికి కనీసం ఒక ఫొటో షూట్ చేస్తుంది. ఆ డబ్బులతోనే నెట్టుకొస్తోంది. ఆమె గ్లామరస్ ఫొటోలకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

కరోనా దెబ్బతో ఫొటో షూట్లు ఆగిపోయాయి. దీంతో పాయల్ కు ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ తన బాధను వ్యక్తంచేసింది పాయల్. పనిలేక, డబ్బుల్లేక జీవితం నిస్సత్తువుగా మారిందని అంటోంది. ఏదేమైనా పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలని, కొన్నాళ్ల పాటు ప్రజలకు ఈ కష్టాలు తప్పవని అంటోంది. అంతా ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చింది.