పీపీఈ కిట్...పాయల్ షూట్!

Paayal shoots for an ad amid coronabreak
Tuesday, July 28, 2020 - 13:45

లాక్ డౌన్ పరిస్థితుల నుంచి అన్ లాక్ మోడ్ లోకి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ అడుగులు వేస్తోంది. హీరోయిన్లు కూడా ధైర్యం చేసి ఒక్కొక్కరే బయటకొస్తున్నారు. మొన్నటికిమొన్న ఓ ప్రమోషనల్ యాక్టివిటీ కోసం శృతిహాసన్ సెట్స్ పైకొచ్చింది. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కూడా షూటింగ్ లొకేషన్ లో అడుగుపెట్టింది.

చాలా నెలల గ్యాప్ తర్వాత మళ్లీ లొకేషన్ లో అడుగుపెట్టానంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది పాయల్. పీపీఈ కిట్లు ధరించి మేకర్ వేస్తున్న మేకప్ మెన్లు, ముఖానికి మాస్క్ వేసుకొని సీన్ చెబుతున్న అసిస్టెంట్ డైరక్టర్లు, కెమెరాకు కవర్లు.. ఇలా అంతా కొత్తగా ఉందంటోంది పాయల్.

Paayal Rajput

ఇంతకీ పాయల్ సెట్స్ పైకొచ్చింది సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూట్ కోసం ఆమె ఇలా ముఖానికి మేకప్ వేసుకుంది. సింగిల్ కాల్షీట్ లో ఈ షూట్ పూర్తయింది. మళ్లీ ఎప్పట్లానే తన ఇంటికి చేరుకుంది పాయల్.