ఈ హీరోయిన్ రెచ్చిపోతోంది

Paayal turns up the heat with revealing pictures
Tuesday, March 24, 2020 - 13:45

పాయల్ ఘోష్.. ఈ పేరు చెబితే వెంటనే ఎవరనేది చెప్పడం కష్టం. అదే ఊసరవెల్లి సినిమాలో సెకెండ్ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు జనం. అవును.. ఆ అమ్మాయే, ఈ అమ్మాయి. ఎక్కడైనా హీరోయిన్లు ఫేడవుట్ అయిన తర్వాత మళ్లీ కనిపించరు. కానీ పాయల్ మాత్రం అలా కాదు, సోషల్ మీడియాలో ఈ అమ్మడు దూసుకుపోతోంది. రోజుకో హాట్ ఫొటోతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

చంద్రశేఖర్ ఏలేటి డైరక్ట్ చేసిన ప్రయాణం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఊసరవెల్లితో ట్రాక్ లోకి వస్తుందనుకుంటే.. అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో టాలీవుడ్ కు బై చెప్పేసింది. పూర్తిగా ఎండోర్స్ మెంట్స్, ఫొటోషూట్స్ నే నమ్ముకుంది. మోడలింగ్ కే పరిమితమైపోయింది.

వీటికి తోడు ఎప్పటికప్పుడు ఇనస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ మతులు పోగొడుతోంది పాయల్. ఈ ఫొటోలు చూసే ఆమెకు రోజురోజుకు ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. కనీసం ఈ హాట్ ఫొటోలైనా ఈ బెంగాలీ పిల్లకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూద్దాం