నిజంగానే ఇది "పహిల్వాన్" డీల్

Pahilwaan gets super deal from satellite
Saturday, September 14, 2019 - 10:15

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది పహిల్వాన్ సినిమా. సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దంగల్ టైపులో ఉంటుందనుకుంటే ఆల్-మిక్స్ కిచిడీ టైపులో సినిమాను తీశారు. ఇంకా చెప్పాలంటే ఇది అసలు పాన్-ఇండియా సినిమానే కాదు. అలా నెగెటివ్ టాక్ తో మొదలైన పహిల్వాన్ ప్రయాణం.. శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం సూపర్ హిట్ అయింది.

అవును.. పహిల్వాన్ శాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయల భారీ రేటుకు అమ్ముడుపోయాయి. వినడానికి, నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం. జీ గ్రూప్ సంస్థ.. ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది. అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కింద 50 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది ఈ గ్రూప్.

నిజానికి ఈ సంస్థపై మొన్నటివరకు ఓ పుకారు నడిచింది. సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో ఈ సంస్థ కాస్త స్పీడ్ తగ్గించిందని, కొత్త సినిమాలేవీ కొనడం లేదనేది ఆ రూమర్ సారాంశం. ఆ టాక్ ఇంకా మార్కెట్లో నలుగుతుండగానే పహిల్వాన్ సినిమాను 50 కోట్ల రూపాయలకు కొనడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది