కరోనాపై పలాస హీరో మూవీ

Palasa hero's new movie on Corona
Thursday, June 18, 2020 - 16:45

కరోనాపై ఇప్పటికే ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు వర్మ. దానికి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ఆమధ్య దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కరోనా నేపథ్యంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించి, ప్రీ-లుక్ పోస్టర్ కూడా వదిలాడు. ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో సినిమా రూపుదిద్దుకోవడానికి సిద్ధమైంది.

"పలాస" ఫేమ్ రక్షిత్ హీరోగా కరోనా వైరస్ పై సినిమా ప్రకటించారు. దీనికి "WHO" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇక్కడ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు, "వరల్డ్ హజార్డ్ ఆర్డినెన్స్" అనేది ఈ మేకర్స్ ఉద్దేశం.

సుధాస్ మీడియా బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో వాసు పిన్నమరాజు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇండియాలో పలు సినిమాలతో పాటు హాలీవుడ్ లో కూడా వర్క్ చేసిన అనుభవం ఇతడికి ఉంది.

రక్షిత్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రక్షిత్ లుక్ బాగుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.