పవన్ వాయిస్ ఓవర్ ఇంకా ఉంది

Pawan Kalyan also gave voice over in Sye Raa, the movie
Tuesday, August 20, 2019 - 23:00

సైరా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించాడు పవన్ కల్యాణ్. ఓవైపు సైరా టీజర్ లో చిరంజీవి ఎప్పీయరెన్స్ ను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు పవన్ వాయిస్ తో పులకరించిపోతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా, ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా అందించారు మెగాస్టార్ చిరంజీవి. టీజర్ తోనే పవన్ కల్యాణ్ వాయిస్ఓవర్ ముగిసిపోలేదని స్పష్టంచేశారు. సినిమాలో కూడా పవన్ గొంతు వినిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు.

"ఈ సినిమాకు నా తమ్ముడు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తమిళ వెర్షన్ కు కమల్ హాసన్ ను సంప్రదించాం. ఆయన కూడా వాయిస్ ఓవర్ ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోలేదు. కాస్త కుదుటపడిన వెంటనే వాయిస్ ఇస్తారు. అటు మలయాళంలో మోహన్ లాల్, సైరాకు వాయిస్ ఇచ్చారు. సినిమాలో ఇంట్రడక్షన్ లో, క్లైమాక్స్ లో వీళ్ల గొంతులు వినిపిస్తాయి."

సైరా టీజర్ లాంఛ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టారు చిరంజీవి. చిరు ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ ఇక సినిమాల్లో నటించడనే విషయం తేలిపోయింది. ఫ్యాన్స్ అంతా చాలా బాధపడ్డారు. ఇలాంటి టైమ్ లో వెండితెరపై కనీసం పవన్ వాయిస్ వినిపించినా వాళ్లకు అదే ఆనందం. సైరా సినిమాతో ఆ ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఫ్యాన్స్.