పవన్-క్రిష్ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది

Pawan Kalyan - Krish film begins rolling
Tuesday, February 4, 2020 - 18:00

ఈమధ్యే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు పవన్. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇవాళ్టి నుంచి పవన్-క్రిష్ సినిమా రెగ్యులర్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్, మొదటి రోజు షూట్ కు పవన్ కూడా హాజరయ్యాడు. ఈ సినిమాకు ప్రస్తుతానికి 15 రోజుల కాల్షీట్లు కేటాయించాడు పవన్.

ఏఎం రత్నం నిర్మాతగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతోంది పవన్-క్రిష్ సినిమా. ఇదొక పీరియాడిక్ సినిమా. స్వతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన కొన్ని సన్నివేశాలకు ఫిక్షన్ జోడించి ఈ సినిమా తీస్తున్నారు. అలా అని ఇందులో ఫ్రీడమ్ ఫైటింగ్ ఎలిమెంట్స్ ఉండవు. సినిమా మొత్తం రాబిన్ హుడ్ స్టయిల్ లో ఉంటుంది. కత్తులు, నిధి అన్వేషణ, తుపాకులతో కాల్పులు వగైరా సరంజామా మొత్తం ఉంటుంది.

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. ప్రతి విషయం లీకుల ద్వారాలనే తెలుస్తోంది. లాంఛింగ్ కు సంబంధించి ఆరోజున క్లాప్ బోర్డ్ పిక్ బయటకు రాగా.. ఈరోజు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఆన్-సెట్ స్టిల్ ఒకటి బయటకొచ్చింది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.