పవన్ అందుకు ఒప్పుకుంటాడా?

Pawan Kalyan to reduce remuneration?
Tuesday, May 5, 2020 - 16:45

కరోనాతో టాలీవుడ్ లో కల్లోలం మొదలైంది. లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. థియేట్రికల్ రెవెన్యూ బాగా తగ్గనుందని మాత్రం అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బాగుంటుందనే డిస్కషన్ ఊపందుకుంది. మరి పవన్ కల్యాణ్ కూడా తన పారితోషికం తగ్గించుకుంటారా?

నిజానికి పవర్ స్టార్ కు మళ్లీ సినిమాల్లోకి రావాలని లేదు. తానిక సినిమాల్లో నటించనని ఒక దశలో పవన్ ప్రకటించారు కూడా. కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా, తన సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్నా పవన్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ సినిమా. అందుకే ఆయన మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కేవలం డబ్బు కోసమే మళ్లీ సినిమాలు చేస్తున్నానని ప్రకటించిన పవన్, ఇలాంటి టైమ్ లో తన పారితోషికం తగ్గించుకుంటారా అనే ప్రశ్న తలెత్తింది.

అయితే ఇలాంటి విషయాల్లో పవన్ తగ్గే రకం కాదు. అవసరమైతే నలుగురికి ఆదర్శంగా నిలిచేందుకు తనే ముందుగా తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారు. తనవైపు వేలెత్తి చూపేలా ఆయనెప్పుడూ వ్యవహరించలేదు. ఇండస్ట్రీకి నిజంగా కష్టం వస్తే ముందుగా నిలబడేది పవన్ మాత్రమే అంటున్నారు అతడి అభిమానులు. అవసరమైతే మరో సినిమా ఎక్స్ ట్రా చేసి డబ్బు సంపాదిస్తారే తప్ప, రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం పవన్ బెట్టుచూపించరని అంటున్నారు