బన్నీకి "పవర్" ఫుల్ కానుక

Pawan Kalyan sends bouquet to Ala Vaikunthapurramloo team
Monday, January 13, 2020 - 17:45

బన్నీకి, పవన్ కు పడదంటారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో కొట్టుకుంటుంటారు. అయితే అల వైకుంఠపురములో సినిమాలో పవన్ కల్యాణ్ సాంగ్ పెట్టడం, ఆ పాటకు స్వయంగా బన్నీ స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ సాంగ్ కు బన్నీ డాన్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య మరింత సహృద్బావ వాతావరణం నెలకొనేలా మరో సంఘటన జరిగింది.

అల వైకుంఠపురుములో యూనిట్ కు ప్రత్యేకంగా పవర్ స్టార్ నుంచి ఓ బొకే అందింది. సినిమా సూపర్ హిట్టయినందుకు టోటల్ యూనిట్ అంతటికీ శుభాకాంక్షలు చెబుతూ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఈ బొకే పంపించారు. తన స్వదస్తూరితో కామెంట్ రాసి, సంతకం పెట్టి మరీ బొకేలు పంపించారు పవన్ కల్యాణ్. దీంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఫీలైంది.

నిజానికి మొన్నటివరకు బన్నీ సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్. తాజాగా జరిగిన ఈ ఘటనలతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా అల వైకుంఠపురములో సినిమా చూడడం మొదలుపెట్టారు. ఈ సంగతి పక్కనపెడితే, బన్నీ గత సినిమాలకు వచ్చిన డివైడ్ టాక్ ఈసారి రాలేదు. ఈ సినిమాకు అది ప్లస్ అయింది.