పవన్ తో సినిమా అంటే అంతే మరి

Pawan Kalyan's erratic shoot schedule
Tuesday, January 21, 2020 - 14:30

జనసేనాని మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. నిన్న (జనవరి 20, 2020) 'పింక్' రీమేక్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే, ఫస్ట్ డే ఫస్ట్ షూటింగ్ కూడా హడావిడిగా ముగించారు. ఆఫ్టర్ నూన్ వరకు షూటింగ్ లో పాల్గొని... వెంటనే అమరావతి వెళ్లిపోయారు. అక్కడ రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి చేసేందుకు ట్రై చేశారు. 

అంటే.. తాను సినిమాల్లో నటిస్తున్నంత మాత్రానా రాజకీయాలను వదిలేసినట్లు కాదు అని క్లియర్ గా క్లారిటీ ఇచ్చినట్లే. అంతేకాదు, తన షూటింగ్ వ్యవహారం ఇలాగే ...ఉంటుంది అని నిర్మాత దిల్ రాజుకి కూడా చెప్పారు. 

పవన్ తో షూటింగ్ అంటే.. ఏ రోజు కి ఆ రోజు ప్లాన్ చేసుకోవాలిసిందే. కచ్చితంగా షూటింగ్ డే అంతా ఉంటాడా అనేది ఎప్పుడూ అనుమానమే. ఆయనకి పాలిటిక్స్ వెరీ ఇంపార్టెంట్. సో... పవన్ కళ్యాణ్ కి సంబదించిన సీన్లు 10 రోజుల్లో పూర్తి చేస్తాము అని దిల్ రాజు అనుకుంటే అంతే సంగతులు. 'పింక్' రీమేక్ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యేంతవరకు... ఏపీలో రాజకీయంగా ప్రశాంత వాతావరణం ఉండాలి అని దిల్ రాజు బలంగా కోరుకోవాలి.