జ‌న‌సేనకి అంజ‌నాదేవి విరాళం

Pawan Kalyan's mother Anjana Devi donates Rs 4 lakh to Jana sena
Tuesday, October 30, 2018 - 19:00

జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న త‌ల్లికి త‌న జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌ని చూపించారు. హైద‌రాబాద్‌లోని  మాదాపూర్‌లో ఉన్న త‌న పార్టీ ఆఫీస్‌కి ఆమెని తీసుకెళ్లారు. అంజనా దేవి త‌న కుమారుడి పార్టీకి 4లక్షల రూపాయ‌ల విరాళం ఇచ్చారు. ఆ చెక్కును పవన్‌కు పార్టీ ఆఫీస్‌లో అందజేశారు. 

త‌న మాతృమూర్తి నుంచి చెక్ తీసుకున్న వెంట‌నే ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు జ‌న‌సేనాని. 

అంజ‌నాదేవి భ‌ర్త కొణిదెల వెంక‌టరావు పోలీసు అధికారిగా ప‌నిచేశారు. ఆయ‌నకి వ‌చ్చిన పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు అంజ‌నాదేవి తెలిపారు.