ఇది పవన్ కల్యాణ్ సినిమా

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చింది "సర్కార్" సినిమా. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్న విజయ్ కు తమిళనాట ఈ సినిమా బాగా కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంగతి పక్కనపెడితే, రాజకీయాల్లోకి రాకముందు తెలుగులో పవన్ ఇలాంటి సినిమా చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం మాత్రం అందరి నుంచి వినిపిస్తోంది.
అవును.. "సర్కార్"లో ఎన్నో సన్నివేశాల్లో పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. కొత్త రాజకీయం రావాలని, యువతలో మార్పు రావాలని, ప్రశ్నించడానికే వచ్చానని విజయ్ చెబుతుంటే.. తెలుగు ప్రేక్షకులకు విజయ్ స్థానంలో పవన్ కల్యాణే కనిపించాడు. ప్రస్తుతం ప్రజాపోరాట యాత్రలో భాగంగా తన ప్రసంగాల్లో పవన్ ప్రస్తావిస్తున్న అంశాలు ఇవే. వీటితో పాటు సినిమాలో మ్యూట్ చేసిన పోలవరం ప్రాజెక్టు అంశం కూడా పవన్ గతంలో ప్రస్తావించినదే.
ఇలా చూసుకుంటే "సర్కార్" సినిమాలో పవన్ రిఫరెన్స్ లు ఎన్నో. కానీ ఏం లాభం. పవన్ సినిమాలు ఆపేశాడు. పూర్తిగా రాజకీయాలకే అంకితమైపోయాడు. కనీసం ఎన్నికల తర్వాతైనా పవన్ కల్యాణ్, సర్కార్ లాంటి సినిమా చేస్తే చూడాలని అతడి అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.
- Log in to post comments