ఆయన నా ఆరాధ్య దైవం: పవర్‌స్టార్‌

Pawawn Kalyan says he cherised meeting his idol Amitabh
Thursday, August 22, 2019 - 12:45

పవన్‌ కల్యాణ్‌ వరుసగా సైరా సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ చేస్తున్నారు. మొదట ఈ సినిమా టీజర్‌కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో పాల్గొని సైరా సినిమాని తెగ పొగిడారు. అన్నయ్య చిరంజీవి జీవితం ఇన్సిపిరేషన్‌ అని చెప్పారు. తాజాగా ఈ రోజు మెగాస్టార్‌ బర్త్‌డే సందర్భంగా ట్విట్టర్‌లో సైరా గురించి వరుసగా ట్వీట్లు వేశారు. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి తాను దిగిన ఫోటోని కూడా షేర్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.

సైరా సినిమా షూటింగ్‌ కోసం అమితాబ్‌ హైదరాబాద్‌ వచ్చినపుడు పవన్‌ కల్యాణ్‌ ఆయన్ని కలిసి ముచ్చటించారు. అప్పటి ఫోటోని ఇపుడు షేర్‌ చేస్తూ... నా ఆరాధ్యమూర్తి అమితాబ్‌ బచ్చన్‌ని ‘సైరా’ సెట్స్‌లో కలిశాను అంటూ ఆనందంగా రాసుకున్నారు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతుందంటూ చెప్పారు పవర్‌స్టార్‌.

మరోవైపు, పవన్‌ కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటిస్తాడా అన్న చర్చ కూడా మొదలైంది. ఆయన సైరా సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాలుపంచుకోవడం ఈ అనుమానాలకి తావు ఇస్తోంది. ఐతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే మెన్సన్‌ చేశారు.