ఇప్పట్లో ఎన్టీఆర్ ను వదలదా!

Payal Ghosh is using NTR's name
Sunday, July 19, 2020 - 12:15

"ఆర్ఆర్ఆర్" సినిమాలో ఎన్టీఆర్ ను రాజమౌళి ఏ రేంజ్ లో వాడుతున్నాడో తెలియదు కానీ.. బయట మాత్రం పాయల్ ఘోష్ అనే హీరోయిన్ తారక్ ను ఓ రేంజ్ లో వాడేస్తోంది. కొన్ని రోజులుగా తారక్ మంత్రం జపిస్తోంది. వరుసగా ట్వీట్స్ పెడుతున్న ఈ భామ, తాజాగా మరోసారి ఎన్టీఆర్ పేరుని వాడుకొంది.

అవయవదానానికి మద్దతిస్తూ 3 రోజుల కిందట ఓ ట్వీట్ పెట్టింది పాయల్. అక్కడితో ఆగలేదు. తాజాగా ఈ క్యాంపెయిన్ లోకి ఎన్టీఆర్ ను లాగింది. లక్షలాది మందిని ప్రభావితం చేసే ఎన్టీఆర్ కూడా అవయవదానానికి మద్దతుగా ముందుకొస్తే చాలా బాగుంటుందని కామెంట్ చేసింది.

Photos: Payal Ghosh

అంతకంటే ముందు ఎన్టీఆర్ గొప్పోడంటూ పలుమార్లు ట్వీట్లు పెట్టిన పాయల్.. సందర్భం ఏదైనా అందులోకి ఎన్టీఆర్ ను లాగుతోంది. చివరికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం టైమ్ లో కూడా టాపిక్ ను ఎన్టీఆర్ వైపు తిప్పేసింది ఈ హీరోయిన్.

కేవలం ఎన్టీఆర్ అభిమానుల్ని తనవైపు తిప్పుకునేందుకు, సోషల్ మీడియాలో రీచ్ పెంచుకునేందుకు మాత్రమే పాయల్ ఇలా ఉన్నఫలంగా తారక్ జపం అందుకున్నదనే విషయం తెలుస్తూనే ఉంది.