పెద్ద సినిమాల హార్డ్ డిస్క్ లీక్‌

Police arrest students for leaking movie footage
Saturday, August 11, 2018 - 23:15

టాలీవుడ్‌ని పైర‌సీ క‌న్నా.. ఇంటి దొంగ‌ల బెడ‌ద ఎక్కువ వేధిస్తోంది. సినిమా టీమ్‌లో ప‌నిచేసే సాంకేతిక నిపుణులు.. షూటింగ్ మ‌ధ్య‌లోనే సినిమా క్లిప్‌ల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం, లీక్ చేయ‌డం ఒక పెద్ద స‌మ‌స్య‌గా మారింది. సినిమా విడుద‌ల‌కి ముందే సినిమా మొత్తం బ‌య‌టికి లీక్ అయిన ఉదంతం అత్తారింటికి దారేదితో చూశాం. తాజాగా ఒక సైబర్ గ్యాంగ్‌ని ఇప్పుడు పోలీసులు ప‌ట్టుకున్నారు. 

హైదరాబాద్ పోలీసులు తాజాగా రాజేష్ అనే ఆన్‌లైన్ ఎడిటర్‌ని అరెస్ట్ చేశారు.  ఒక హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న కొన్ని పెద్ద సినిమాల‌కి సంబంధించిన అస‌లైన ఫుటేజ్ ఈ హార్డ్ డిస్క్‌లో ఉంద‌ట‌. గుంటూరు వీఐజేటీ కాలేజీకి చెందిన 17 మంది విద్యార్థులు ఈ ఫుటేజ్‌ని సైబ‌ర్ స్పేష్‌లో ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు గుర్తించారు పోలీసులు. త్వ‌ర‌లో విడుదల కాబోతున్న గీత గోవిందం, ప్ర‌స్తుతం షూటింగ్‌లో ఉన్న అర‌వింద స‌మేత వంటి సినిమాల‌ను లీక్ చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ట‌.