వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులు అరెస్ట్

Police arrest who trespassed into Mohan Babu's house
Sunday, August 2, 2020 - 14:00

సినీనటుడు మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు వచ్చి హెచ్చరించిన వ్యక్తుల్ని పోలీసులు గంటల వ్యవథిలో పట్టుకున్నారు. వీళ్లను మైలార్ దేవ్ పల్లిలోని దుర్గానగర్ కు చెందిన యువకులుగా గుర్తించారు. వీళ్లంతా నిన్న రాత్రి కారులో మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు వచ్చి బెదిరించారు.

ఇన్నోవా కారులో వచ్చిన ఈ వ్యక్తులు, నేరుగా మోహన్ బాబు ఫామ్ హౌజ్ గుమ్మం వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్టు వాచ్ మెన్ తెలిపాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కారును గుర్తించారు. ఆ సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీళ్లంతట వీరే వార్నింగ్ ఇచ్చారా లేక వేరే వ్యక్తులు ఎవరైనా వీళ్ల చేత బెదిరింపులకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.