జబర్దస్త్ గా పట్టుబడ్డ నటుడు

Police take Dorababu in custody
Wednesday, March 4, 2020 - 17:30

జబర్దస్త్ కార్యక్రమం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు దొరబాబు గురించి ప్రత్యేకంగా పరిచయ కార్యక్రమం అక్కర్లేదు. దాదాపు అన్ని స్కిట్స్ లో అతడు ఒకే తరహా పాత్ర పోషిస్తుంటాడు. ఉమెనైజర్ గా, అమ్మాయిల కోసం వెంపర్లాడే వ్యక్తిగా, గుడి వెనక నాసామి లాంటి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు అదే పాత్రను నిజ జీవితంలో కూడా పోషించాడు దొరబాబు. అవును.. విశాఖపట్నంలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో దొరబాబు దొరికిపోయాడు.

విశాఖలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మాధవధార ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ ఉంది. అందులోని ఓ ఫ్లాట్ లో హైటెక్ వ్యభిచారం ప్రారంభమైంది. ఫ్లాట్ అంతా ఖాళీగానే ఉంటుంది. బుకింగ్స్ అన్నీ బయటే అవుతాయి. డీల్ ఓకే అయిన తర్వాత వాళ్ల చేతికి ఫ్లాట్ తాళాలు వస్తాయి. అలా రోజుకో జంట ఫ్లాట్ కు రావడం, వెళ్లడం కామన్ అయిపోయింది. ఒక్కోసారి రోజుకు 5-6 జంటలు కూడా వచ్చి వెళ్తుంటాయి.

దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పకడ్బందీగా రైడ్ చేశారు. ఇద్దరు నిర్వహకులతో పాటు ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో దొరబాబు కూడా ఉన్నాడు. దొరబాబుతో పాటు మరో జబర్దస్త్ కంటెస్టెంట్ పరదేశి కూడా ఈ రైడ్స్ లో దొరికిపోయాడు. వీళ్లిద్దరూ హైపర్ ఆది టీమ్ లో కొనసాగుతున్నారు.