ఉయ్యాల‌వాడ: లాంఛ‌నంగా లాంచ్

Pooja for Chiranjeevi's Uyyalavada Narasimha Reddy held
Wednesday, August 16, 2017 - 15:30

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభం అయింది. ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవితం ఆధారంగా  ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నిజానికి ఈ మూవీని ఆగ‌స్ట్ 15న ప్రారంభించాల‌నుకున్నారు. కానీ ఆ రోజు ముహూర్తం బాలేద‌ట‌. ఆగ‌స్ట్ 16న మంచి ముహూర్తం ఉండ‌డంతో సింపుల్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ని నిర్వ‌హించారు. భారీ లాంచ్ వ‌చ్చే నెల‌లో ఉంటుంది. 

సురేంద‌ర్‌రెడ్డి డైర‌క్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ భారీ దేశ‌భ‌క్తి చిత్రానికి రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ఆఫీస్‌లో పూజ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. చిరంజీవి పుట్టిన రోజైన ఆగ‌స్ట్ 22న సినిమా మొద‌టి లుక్‌, టైటిల్ లోగో విడుద‌ల కానున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్‌గా న‌య‌న‌తార దాదాపుగా క‌న్‌ఫ‌మ్ అయింది. ఆమె అడిగినంత భారీ పారితోషికం ఇచ్చేందుకు అయిష్టంగానే ఒప్పుకున్నారు చ‌ర‌ణ్‌, చిరు. 

అయితే మెయిన్ హీరోయిన్ ఇంకా సెల‌క్ట్ కాలేదు. ఐశ్వ‌ర్యారాయ్ అయితే బాగుంటుంద‌నేది చిరు ఆలోచ‌న‌. కానీ ఆమె పారితోషికం విష‌యంలో కొండెక్కి కూర్చొంది. దాంతో ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.