ప్రభాస్ ఖాతాలో మరో బిర్యానీ ఫ్రెండ్

Pooja Hegde is fidaa over Prabhas
Wednesday, November 27, 2019 - 09:45

హీరోయిన్లు ప్రభాస్ ను ఎంతలా ఇష్టపడతారో, అతడు పెట్టే భోజనాన్ని కూడా అంతే ఇష్టపడతారు. ప్రభాస్ పేరెత్తగానే హీరోయిన్లు ముందుగా చెప్పే విషయం ఈ తిండి గురించే. ప్రభాస్ తో కలిస్తే తిండికి ఢోకా ఉండదని చెబుతారంతా. ఇప్పుడీ లిస్ట్ లోకి పూజా హెగ్డే కూడా చేరిపోయింది.

"ప్రభాస్ నా పక్కనుంటే చాలు నేను భోజనం గురించి ఆలోచించడం మానేస్తాను. మరీ ముఖ్యంగా ప్రభాస్ కు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో ఖాళీగా ఉంటే మటన్ బిర్యానీ అద్భుతంగా చేస్తాను. ప్రభాస్ కు కూడా అదే ఇష్టం. సెట్స్ లో ఉంటే మెల్లగా ప్రభాస్ చెవిలో చెబుతాను. వెంటనే బిర్యానీ వచ్చేస్తుంది."

తామిద్దరం ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఎలాంటి కండిషన్ లో ఉన్నప్పటికీ, పక్కన ప్రభాస్ ఉంటే బిర్యానీ దొరికేస్తుందని అంటోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ హీరోతో కలిసి జాన్ (వర్కింగ్ టైటిల్ మాత్రమే) అనే సినిమా చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమాలో పీరియాడిక్ యూరోప్ ను చూస్తారంటోంది. 80ల్లో యూరోప్ వాసులు ఎలాంటి దుస్తులు వేసుకునేవారో, అలాంటి దుస్తుల్లో తామిద్దరం కనిపిస్తామని చెబుతోంది.