పూజా..అందానికి సొంతూరు

Pooja Hegde gets good lyrics
Saturday, September 15, 2018 - 21:00

పూజా హెగ్డే అందాన్ని సినీమ‌హాక‌వి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి కొత్త‌గా వ‌ర్ణించారు. "అర‌వింద స‌మేత" సినిమాలో ఆమె అర‌వింద అనే పాత్ర పోషిస్తోంది. "అర‌వింద...క‌నువింద" వంటి నాసిర‌కం ప్రాస కూడా ఇందులో ఉంది. ఇలాంటివి సిరివెన్నెల నుంచి ఊహించం కానీ మిగ‌తా ఎక్స్‌ప్రెష‌న్స్ ఆయ‌న మార్క్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా పాట ప‌ల్ల‌వికి హుక్ లైన్ అనిపించే "అన‌గ‌న‌గా అర‌వింద‌ట త‌న పేరు అందానికి సొంతూరు" బాగుంది.

"చీకటిలాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?

అన‌గ‌న‌గా అర‌వింద‌ట త‌న పేరుఅందానికి సొంతూరు
అర‌రే
అటు చూస్తే కుర్రాళ్లూ అస‌లేమిపోతారు
అన్యాయం క‌దా ఇది అని  అన‌రే ఎవ‌రూ...."

ఇలా  అందంగా సాగుతుంది ఈ పాట‌.

హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే అర‌వింద‌గా, ఎన్టీఆర్ వీర‌రాఘ‌వ‌గా న‌టిస్తున్నాడు. సినిమా అంతా ఎన్టీఆర్ సీమ యాస‌లో మాట్లాడుతాడు.