ముద్దుముద్దుగా జాగ్రత్తలు చెప్పిన పూజ

Pooja Hegde gives a message in Telugu about precautions during corona
Monday, May 4, 2020 - 16:00

పూజా హెగ్డే తెలుగులో చక్కగా మాట్లాడుతుందనే విషయం మనందరికి తెలిసిందే. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో తన క్యారెక్టర్లకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడీ బ్యూటీ మరోసారి తెలుగులో పలకరించింది. ఏకంగా కరోనా జాగ్రత్తలు చెబుతోంది.

తెలుగు ప్రజలందరికీ నమస్కారం అంటూ ప్రారంభించిన పూజా హెగ్డే.. కంటికి కనిపించని శత్రువుతో ప్రస్తుతం మనం యుద్ధం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. కరోనాపై విజయం సాధించాలంటే ఇంట్లోనే ఉండాలని, ఎమర్జన్సీ అయితే తప్ప బయటకు రావొద్దని అందర్నీ రిక్వెస్ట్ చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్, గ్లౌజులు ధరించాలని కోరుతోంది పూజా హెగ్డే.

లాక్ డౌన్ లో భాగంగా ఇంట్లోనే ఉంటున్న పూజా హెగ్డే ఇప్పటికే ఓసారి లైవ్ ఛాట్ తో అభిమానులను పలకరించింది. ప్రస్తుతం కొత్తకొత్త వంటకాలు ట్రై చేస్తున్న ఈ చిన్నది.. మేకప్ లేకుండా వీడియో చేసి రిలీజ్ చేసింది.